అఖండ తర్వాత బాలకృష్ణ తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కధానాయిక కాగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటెర్టైనెర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి రిలీజ్ ఐన బాలయ్య ఫస్ట్ లుక్కుకి అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించనున్న దునియా విజయ్ NBK#107 టీంతో జాయిన్ అయ్యారు. తెలుగులో ఆయన నటిస్తున్న మొదటి చిత్రం కావటంతో ఈ మలయాళ నటుడిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు దర్శకుడు గోపీచంద్ మలినేని అండ్ టీం. మలయాళ చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ను ప్రారంభించి, చిన్న పాత్రల్లో నటించి, ఆ తర్వాత విలన్ గా మారిన విజయ్ దునియా సినిమాతో మలయాళంలో స్టార్ హీరో అయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa