పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమా 100కోట్ల షేర్ను రాబట్టింది. బాలీవుడ్ ప్రేక్షకులకి కూడా ఈ సినిమా అందించాలన్న ఉద్దేశంతో హిందీలో కూడా విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల రిలీజ్ చేసారు మేకర్స్. ఇక విడుదలే తరువాయి అనుకుంటున్న నేపథ్యంలో ఏప్రిల్ కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ ఈ నెల 11 న ,ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ల పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ ఈ నెల 25న ఉండటంతో భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ ను ఏప్రిల్ లో విడుదల చేయటానికి నిర్మాతలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa