ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణతో తలపడే మరో విలన్ వచ్చేశాడు

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 03:24 PM

బాలకృష్ణకు అభిమానుల్లో ఉండే క్రేజ్ తెలియందికాదు. అయితే ఆయనతో తలపడే విలన్ల రేంజ్ కూడా అంతగానే ఉంటుంది. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కెరియర్ పరంగా  బాలకృష్ణకి ఇది 107వ సినిమా. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఫస్టు షెడ్యూల్లో రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.  ఈ సినిమాలో బాలకృష్ణతో తలపడే విలన్ గా కన్నడ ఆర్టిస్ట్ దునియా విజయ్ నటిస్తున్నాడు. కన్నడలో విలన్ రోల్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న దునియా విజయ్, ఆ తరువాత హీరోగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇతర భాషల్లో విలన్ పాత్రలు చేయడానికి కూడా ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణ సినిమా కోసం దునియా విజయ్ రంగంలోకి దిగిపోయాడు. ఆయనకు బొకే అందజేసి మరీ గోపీచంద్ మలినేని టీమ్ సెట్స్ లోకి వెల్ కమ్ చెప్పింది. ఇక ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుండగా, కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa