ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాలార్ కు ప్రత్యేకత తెచ్చిపెట్టనున్న సముద్రంలోని ఫైట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 01:10 AM

ఒక్కో చిత్రం హిట్ వెనక కొన్ని సన్నివేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తాజాగా ప్రభాస్ నట్టిస్తున్న సాలార్ చిత్రానికి అలాంటి సన్నివేశమే మొత్తం సినిమాలో హైలెట్ గా నిలవనున్నది. ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' రూపొందుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటలీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమా తరువాత ఆయన నుంచి 'సలార్' రానుంది .. ఇది పూర్తిగా మాస్ యాక్షన్ మూవీ. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు సముద్రంపై జరిగే ఛేజింగ్ .. సముద్రం లోపల జరిగే ఫైట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని అంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం 20 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ ఇద్దరి మధ్య లవ్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయట. ఒక స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ ను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa