ఇటీవల సామాజిక సందేశభరిత చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్న హీరో సూర్య తాజా చిత్రంలో అన్ని కోణాలకు ఆస్కారమిచ్చారు. సూర్య కథానాయకుడిగా 'ఈటి' రూపొందింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సూర్య బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ .. "లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాలో బలమైన సామాజిక సందేశం ఉంటుంది. కథాకథనాలను .. పాత్రలను పాండిరాజ్ మలిచిన విధానం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొదటిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో వినయ్ రాయ్ కనిపిస్తాడు. తెలుగులో విలన్ పాత్రలను రాజమౌళిగారు చాలా శక్తిమంతంగా డిజైన్ చేస్తుంటారు. అదే తరహాలో ఈ సినిమాలోని విలన్ రోల్ ను పాండిరాజ్ డిజైన్ చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది. నా నెక్స్ట్ ప్రాజెక్టులు వెట్రి మారన్ .. బాలాతో ఉన్నాయి" అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa