ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విడుదల కానున్న “భీమ్లా నాయక్” జూక్ బాక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 10:14 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించడం జరిగింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించడం జరిగింది.


ఈ చిత్రం కి సంబంధించిన జూక్ బాక్స్ ను నేడు విడుదల చేస్తున్నట్లు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపారు. ఈ చిత్రం లో ఉన్న కొన్ని బిట్ సాంగ్స్ ను కూడా యాడ్ చేసినట్లు థమన్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ ఒక వీడియో ను జత చేశారు. అందులో థమన్ తో పాటుగా సింగర్ మనీష మరియు శివమణి కూడా ఉండటం విశేషం. ఈ అప్డేట్ పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa