ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయం గురించి హరీష్ శంకర్ ను అడగండి - పూజా హెగ్డే

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 02:44 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ భవదీయుడు భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ అని చిత్రసీమలో పుకారు. రాధేశ్యామ్ ప్రమోషన్సులో భాగంగా ఒక విలేఖరి ఈ విషయం గురించి పూజాహెగ్డేని ప్రశ్నించాడు. అయితే ఆమె యెస్ ఆర్  నో చెప్పకుండా ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ను అడగండని సమాధానం ఇచ్చింది. పూజా హెపోథెటికల్ సమాధానంతో ఎవరికీ తోచినట్లు వారు అర్ధం చేసుకుంటున్నారు. కొందరేమో పవన్ తో పూజా నటిస్తుందనీ, మరికొందరేమో నటించట్లేదని వాదిస్తున్నారు.


రాధేశ్యామ్ సినిమా సక్సెస్ అయితే కనక పూజా కి పాన్ ఇండియా ఇమేజ్ సొంతం అవుతుంది. ఒక వేళ పవన్ తో  కనక నటిస్తే పూజ క్రేజ్ భవదీయుడు భగత్ సింగ్ కు బాగా ఉపయోగపడుతుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  భవదీయుడు భగత్ సింగ్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని పవన్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు హరీష్ శంకర్. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లోపు  సినిమాలో నటించే హీరోయిన్ ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa