ట్రెండింగ్
Epaper    English    தமிழ்

#మెగా 154 మగువ శృతిహాసన్ ఈస్ ఆన్ బోర్డ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 02:49 PM

వెంకీ మామ తరువాత మెగా స్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్లు ఎప్పుడో ప్రకటించాడు దర్శకుడు K.S రవీంద్ర అలియాస్ బాబీ. కానీ ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. ఇక ఈ కాంబినేషన్లో సినిమా ఉండదులే అని జనాలు అనుకుంటున్న సమయంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. 


నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన 154 వ సినిమాలో కథానాయికగా శృతి హాసన్ ను అధికారికంగా ప్రకటించారు మెగాస్టార్. ఈ విషయాన్నిట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు చిరు.    


ఈ చిత్ర దర్శకుడు బాబీ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. #మెగా154 మగువగా ఎంపికైన గార్జియస్, టాలెంటెడ్ శృతి హాసన్ కు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలని మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ ట్విట్టర్లో షేర్ చేసారు. 


#మెగా154 కు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. 


ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో బాలకృష్ణ పక్కన NBK#107లో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ లోనూ నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa