ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారోడు' వస్తున్న రామ్ చరణ్...?

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 01:06 AM

మంచి దూకుడుమీదున్న రామ్ చరణ్ తాజాగా 'సర్కారోడు'  అన్న టైటితో అభిమానుల ముందు వచ్చేందుకు సిద్దమవుతున్నాడటా. ఒకవైపున చరణ్ కథానాయకుడిగా నటించిన 'ఆర్ ఆర్ ఆర్' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మరో వైపున ఆయన కీలకమైన పాత్రను పోషించిన 'ఆచార్య' కూడా త్వరలో విడుదల కావడానికి తగిన సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆయన శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.  దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా కెరియర్ పరంగా చరణ్ కి 15వ సినిమా. ఇక దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా ఇది. ఇలా ఈ సినిమా మరో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తోంది. ఈ సినిమాలో  చరన్ సరసన నాయికగా కియారా అద్వాని అలరించనుంది. 'వినయవిధేయరామ' తరువాత చరణ్ జోడీగా ఆమె చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం 'సర్కారోడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ టైటిల్ గురించిన విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. అవినీతి రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్  ఏం చేశాడనేదే ఈ సినిమా కథ అని అంటున్నారు. తమన్ ఈ సినిమాకి బాణీలను అందిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa