ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కలు నాటిన బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హన్మంత్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 11:50 AM

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌సీ పార్క్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హన్మంత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిరి హన్మంత్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. భావి తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఆ తర్వాత తన స్నేహితులైన ప్రియ, వైష్ణవి చైతన్య, శ్రీహన్‌లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa