ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ ఆంటోనీ కొత్త సినిమా...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 12:46 PM

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ వెళ్లే తమిళ హీరో విజయ్ ఆంటోనీ. తెలుగులో బిచ్చగాడు సినిమాతో మాసివ్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత, తెలుగులో డబ్ ఐన విజయ్  సినిమాలు అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేకపోయాయి. 


అయితే విజయ్ నటించిన తాజా తమిళ చిత్రం కొలై. తెలుగులో 'హత్య' గా విడుదలవనుంది. యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు బాలాజీ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. కమల్ బొహ్రా,ధనుంజయన్, ప్రదీప్ ఈ చిత్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  


ఈ సినిమాలో విజయ్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తుండగా, ఆయనకు అసిస్టెంటుగా రితికా సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాధికా,మీనాక్షి చౌదరి, మురళి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa