ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాంకర్ రష్మీ పై సినీ నిర్మాత సంచలన వ్యాఖ్యలు...!

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 02:30 PM

ఓ వైపు టెలివిజన్ షోలలో యాంకర్‌గా రాణిస్తున్న రష్మి మరో వైపు సినిమాలు కూడా చేస్తోంది. ఆమె హీరోయిన్‌గా నటించిన గుంటూరు టాకీస్, అంతం సినిమాలు ఆకట్టుకున్నాయి. ఈ తరుణంలో ఆమెపై సినీ నిర్మాత బాలాజీ నాగలింగం మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాణిగారి సినిమాలో తాను రష్మిని బెదిరించానని ఆమె చెబుతోందని, ఘటన వెనుక వాస్తవాలను వెల్లడించారు. ఆ సినిమా సగం పూర్తి చేశాక హీరోను మార్చేయాలని ఆమె డిమాండ్ చేసిందన్నారు. అయితే ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తే తిరిగి తనపై బెదిరింపులకు పాల్పడిందన్నారు. తనకు నాగబాబు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసని చెప్పి బెదిరించిందన్నారు. తాను కూడా చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నానని, సినిమా పూర్తి చేయకుంటే ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేస్తానని అన్నానన్నారు. దీంతో దిగొచ్చి, సినిమా పూర్తి చేసిందని వివరించారు. ఆమె సింగిల్ టేక్‌లోనే షాట్ పూర్తి చేస్తుందని ప్రశంసలు కురిపించారు. తన వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడినందుకే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని, ఆ ఘటనకు సంబంధించి ఆడియో కాల్ రికార్డు తన వద్ద ఉందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa