బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీ నుండి హీరో శివ పాత్రను పరిచయం చేస్తూ గతేడాది విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుండి హీరోయిన్ ఇషా పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు చిత్రబృందం. మార్చి 15 అంటే ఈ రోజు ఆలియా భట్ పుట్టిన రోజు కావటంతో ఈ టీజర్ ద్వారా ఆలియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిత్రబృందం. ఇషా గా ఆలియా లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
మోడరన్ మైథలాజికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, మౌని రాయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2022 సెప్టెంబర్ 9న విడుదలవనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa