సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్‌ల కోసం 'RRR' టీమ్ అంతా సిద్ధంగా ఉంది.అందులో భాగంగా SSరాజమౌళి,ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఒక స్పెషల్ ఇంకా ఫన్నీ ఇంటర్వ్యూలో కనిపించనున్నారు. పాపులర్ యూట్యూబర్ భువన్ బామ్ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ కోసం 'RRR' దర్శకుడు అండ్ స్టార్ హీరోలని కలిసాడు.కామెడీ యూట్యూబ్ ఛానెల్ -BBకి వైన్స్‌లో 'TITU టాక్స్' అనే ఇంటర్వ్యూ ని మేకర్స్ రిలీజ్ చేసారు.ఇంటర్వ్యూలో,భువన్ బామ్ ఎన్టీఆర్ నటించిన ప్లాప్ మూవీ 'శక్తి' సినిమా గురించి అండ్ బాక్సాఫీస్ వద్ద డడ్ అయిన రామ్ చరణ్ 'జంజీర్' సినిమా గురించి అడిగాడు. ఈ స్టార్ హీరోస్ అండ్ రాజమౌళి రియాక్షన్స్ చూడటానికి చాలా బాగున్నాయి.ఈ ఫుల్ ఇంటర్వ్యూ చాల ఫన్నీ గా జరిగింది.ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa