సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.కొన్నిరోజుల క్రితం 'RRR' మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేయటంలేదు అని ప్రకటించారు.తాజా రిపోర్ట్స్ ప్రకారం,'RRR' యూనిట్ మరో ట్రైలర్ ని రిలీజ్ చేయటానికి చూస్తున్నట్లుగా సమాచారం.రెండవ ట్రైలర్‌కి సంబంధించిన బ్యాక్ ఎండ్ వర్క్‌లు ఇప్పటికే జరుగుతున్నాయి.అయితే సినిమా విడుదలకు కొన్నిరోజుల ముందు ఈ ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa