సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమాలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.యూఎస్‌లో ఈ సినిమా ఘనంగా విడుదల కానుండగా,యూరప్‌లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.యూకేతో పాటుగా 30 దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతున్నట్లుగా సమాచారం.పోలాండ్,స్వీడన్ అండ్ ఫిన్లాండ్ వంటి కొన్ని దేశాల్లో ఈ హై బడ్జెట్ సినిమా భారీ స్క్రీన్‌లలో విడుదల కానుంది.అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే ప్రారంభమయ్యాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ హై బడ్జెట్ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa