గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నరన్న విషయం తెలిసిందే. కెరీర్లో బాలయ్యకిది 107వ సినిమా. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మళయాళ స్టార్ యాక్టర్ విజయ్ ప్రతికథానాయకుడిగా నటిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన బాలయ్య ఫస్ట్ లుక్ కు అభిమానుల నుండి విశేష స్పందన రాగా తాజాగా ఈ చిత్రంలో విలన్ పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ముసలిమడుగు ప్రతాపరెడ్డి పాత్రలో దునియా విజయ్ సిగరెట్ వెలిగించుకుంటున్న ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఈ లుక్ ఒక్కటి చాలు ఈ సినిమాలో విలన్ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పటానికి అన్నట్టుంది పోస్టర్.
మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa