ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్ తరుణ్ "స్టాండప్ రాహుల్" ప్రీ రిలీజ్ ఈవెంట్.... చీఫ్ గెస్ట్ గా మెగా హీరో?

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 01:30 PM

శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో, రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం స్టాండప్ రాహుల్. డ్రీం టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ పతాకంపై నంద్ కుమార్ అబ్బినేని,భరత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


ఇటీవలే ఈ సినిమా ప్రొమోషన్స్ కార్యక్రమాలు చేపట్టారు చిత్రబృందం. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ హాల్ లో బుధవారం ఆరున్నర గంటలకు జరపటానికి ముహూర్తం ఖరారు చేశారు చిత్రబృందం. ఈ ఈవెంటుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు అధికారికంగా తెలిపింది ఈ మూవీ టీం. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 


రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa