యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్' సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.సంతోమోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ కామిక్ పాత్రలో నటించాడు.వెనిల్లా కిషోర్,దేవి ప్రసాద్,మధురిమ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,హైదరాబాద్‌లోని ఆర్‌సి కన్వెన్షన్‌లో ఈరోజు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు.ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హాజరుఅవుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నందకుమార్ అబ్బినేని అండ్ భరత్ మాగులూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.మార్చి 18,2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa