బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో నటి హిమజ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ అభిమానులతో సంభాషిస్తూ, వారు అడిగిన ప్రశ్నలకు బదులిస్తుంటుంది. తాను చేసే ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. మోడలింగ్‌లో ప్రతిభ చాటిన ఈమెకు సీరియల్స్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. క్రమంగా సీరియల్స్‌కు స్వస్తి చెప్పి, సినిమాలలో నటిస్తూ పేరు సంపాందించింది. హీరోయిన్‌లకు ఫ్రెండ్ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీవీ షోలు, సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె కల్లు తాగుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా దానికి ఇటీవల బీస్ట్ సినిమాలో హిట్ సాంగ్ అరబిక్ కుతు మ్యూజిక్‌ను జోడించింది. కల్లు సూపర్ టేస్టీగా ఉందని కితాబిచ్చింది. దానిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.