యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్' సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.సంతోమోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ కామిక్ పాత్రలో నటించాడు.వెనిల్లా కిషోర్,దేవి ప్రసాద్,మధురిమ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.రీసెంట్‌గా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసి CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందింది.ఈ సినిమా 134నిమిషాల రన్‌టైమ్ ను కలిగి ఉంది అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నందకుమార్ అబ్బినేని అండ్ భరత్ మాగులూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.మార్చి 18,2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa