ప్రభాస్ అంటే అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఏ పాటిదో అందరికీ తెలుసు. ఇక ఆమెకు అందాల భామ తోడైతే. ఇదిలావుంటే అందానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుందని అడిగేవారికి అందుకు ఉదాహరణగా కృతి శెట్టిని చూపించవచ్చు. ఇండస్ట్రీలోకి ఈ సుందరి అడుగుపెట్టిన వేళా విశేషం బాగుంది. ఒక సినిమా తరువాత ఒకటిగా పొలోమంటూ అవకాశాలు వచ్చి ఒళ్లో వాలిపోతున్నాయి. ఈ భామ కూడా కెరియర్ పై పూర్తి క్లారిటీతోనే ఉంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి, ఈ ఏడాదితోనే మరో మూడు సినిమాల ద్వారా యూత్ ను పలకరించనుంది. ఆ జాబితాలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' .. 'ది వారియర్' .. 'మాచర్ల నియోజక వర్గం' సినిమాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సూర్య - బాల కాంబినేషన్లో రూపొందే సినిమాలో రెండవ కథానాయికగా ఎంపికైందని అంటున్నారు. అంతేకాదు .. ఏకంగా ప్రభాస్ జోడీగా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి 'రాజా డీలక్స్' సినిమాను రూపొందించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు నాయికలు కనిపించనున్నారు. కృతి శెట్టిని ఒక కథానాయికగా .. మాళవిక మోహనన్ ను మరో కథానాయికగా తీసుకున్నారట. మరో కథానాయికగా ఎవరిని ఎంచుకుంటారనేది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa