అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన 'అల వైకుంఠపురంలో' సినిమాలో విలన్గా డిఫరెంట్ మ్యానరిజంతో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సముద్ర ఖని. ఆయన కేవలం నటుడిగానే కాక, మంచి రచయితగా, దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. తమిళంలో ఆయన దర్శకత్వం వహించి, నటించిన చిత్రం వినోదయ సిత్తం. ఆ మూవీ తమిళ నాట సూపర్ హిట్. తెలుగులో ఆ సినిమాని రీమేక్ చేయటానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని లైన్లో పెట్టాడు సముద్ర ఖని.
తాజాగా సముద్ర ఖని ఒక కథని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వినిపించాడట. ఆ కథ చెర్రీకి బాగా నచ్చటంతో సముద్రఖని మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రొమోషన్స్ లో, శంకర్ దర్శత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ షూటింగుతో బిజీగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa