ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గని ట్రైలర్ రిలీజ్... నాకవుట్ పంచ్ కు సిద్ధమైన గని...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 12:47 PM

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రినైస్సన్స్ పిక్చర్స్ పతాకంపై అల్లు బాబీ,సిద్దు నిర్మించారు. సయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి, జగపతి బాబు,నవీన్ చంద్ర, నదియా కీలక పాత్రలు పోషించారు. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు నిర్మాతలు. 


తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. లవ్-యాక్షన్-ఎమోషన్ తో కూడిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా కోసం విదేశాలకు వెళ్లి బాక్సింగ్ మెళకువలు నేర్చుకున్నాడట వరుణ్. మరి వరుణ్ పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని ఈ చిత్ర విజయం రూపంలో ఇవ్వాలని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa