ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ‌ర్ ‘బ‌మ్ చిక్ బ‌బ్లూ’ మ్యారేజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 02:18 PM

యూట్యూబ్ ఛానెల్ తో ఫేమ‌స్ అయిన యూట్యూబ‌ర్ బ‌మ్ చిక్ బ‌బ్లూ ఆర్య స‌మాజ్ లో ఎవ్వ‌రికీ తెలియ‌కుండా పెళ్లి చేసుకున్నాడు. మొదట ఓ పెద్ద యూట్యూబ్ ఛానెల్‌లో వేరే యూట్యూబర్స్ చేసే వీడియోల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడు బబ్లూ మాయ. అయితే కొన్నాళ్ల తర్వాత తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. ఈ యూట్యూబ్ ఛానెల్ కొంతకాలం సక్సెస్‌ఫుల్‌గానే రన్ అయ్యింది. కొన్నాళ్ల నుండి యూట్యూబ్‌లో కూడా పోటీ పెరిగిపోవడంతో బబ్లూ కాస్త వెనక్కి తగ్గాడు. యూట్యూబర్‌గా గుర్తింపు సంపాదించుకున్న బబ్లూ ఎవరికీ తెలియకుండా ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు. అంతే కాకుండా ఈ పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa