ధమాకా సినిమా టీం స్పెయిన్ కు వెళ్లింది. ఎందుకు తెలుసా...? రవితేజకి ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇక దర్శకుడిగా త్రినాథరావు నక్కిన కూడా మాస్ పల్స్ బాగా తెలిసినవాడే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే అందరిలో ఆసక్తి పెరగడం సహజం. ఈ ఇద్దరో కాంబినేషన్లో 'ధమాకా' అనే సినిమా సెట్స్ పైకి వెళ్లి కొంత కాలమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు మూడు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ స్పెయిన్ వెళ్లింది. అక్కడ ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ స్వరపరిచిన ఈ పాట మనసుకు పట్టేసేదిగా ఉంటుందని అంటున్నారు. ఆ సందర్భంలో దిగిన ఒక ఫొటోను మేకర్స్ వదిలారు. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ సినిమాను నిర్మిస్తున్నారు. 'పెళ్లి సందD' తరువాత శ్రీలీల చేస్తున్న సినిమా ఇది. ఒక కుర్ర హీరో జోడీ నుంచి ఆ వెంటనే ఒక సీనియర్ హీరో సరసన చేయడానికి ఆమె అంగీకరించడం విశేషం. ఈ సినిమా కంటే ముందుగా రవితేజ నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ' రానుందనే విషయం తెలిసిందే. ఆ తరువాత 'రావణాసుర' లైన్లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa