ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన “పెన్నీ సాంగ్”..!

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 04:02 PM

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సర్కార్ వారి పాట. మే 12న భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
తాజాగా సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ పాట ఇప్పుడు టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. మహేష్ తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఇంతకుముందు ఈ పాట 24 గంటల్లో 14.78 మిలియన్ వ్యూస్ రాగా, 22 గంటల్లో పెన్నీ సాంగ్ 15 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. ఏది ఏమైనప్పటికీ ఫాస్టెస్ట్ 15 మిలియన్ వ్యూస్ అందుకున్న ఈ పాట టాలీవుడ్ లో రికార్డు సృష్టించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa