హలో.. అంటూ తెలుగు తెరకు పరిచయం అయింది కల్యాణి ప్రియదర్శన్. అఖిల్ అక్కినేని తో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం సినిమాలు చేసింది. 'హీరో' సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది హృదయం, బ్రో డాడీ సినిమాలతో విజయాలు అందుకుంది. ట్రెండీ లుక్స్ తో కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ.. సాంప్రదాయ చీరలోనూ మరింత అందంగా కనిపిస్తుంటుంది. చీర కట్టులో కాసీ లుక్ లో కనిపిస్తున్న కళ్యాణి లేటెస్ట్ ఫోటోలు అభి మానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం 'తల్లుమాల' అనే మలయాళ సినిమాలో నటిస్తుంది కల్యాణి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa