ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరణ్ ఫ్యాన్స్ భారీ బైక్ ర్యాలీ... అల్లూరి గెటప్ లో వినూత్నంగా

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 01:14 PM

ప్రేక్షకుల నాలుగేళ్ళ ఎందుచూపులకు తెరదించుతూ, తారక్, చెర్రీ లతో రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ నేడు ధియేటర్లలోకొచ్చేసింది. దేశవ్యాప్తంగా అభిమానులు ఆర్ ఆర్ ఆర్ మ్యానియాతో ఊగిపోతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా తారక్, చరణ్ ల ఫ్యాన్స్ హంగామానే. ఇప్పటికే తారక్, చరణ్ ల భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పాలాభిషేకాలతో అభిమానులు ఎవరికి తోచినట్టు వారు హడావిడి చేస్తుంటే... హైదరాబాద్ యువత వినూత్నంగా చరణ్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంది. 


హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో చరణ్ ఫ్యాన్స్ బైక్ ర్యాలీ చేసారు.చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో పోషించిన మన్నెం దొర అల్లూరి సీతారామరాజు వేషం ధరించి దాదాపు వందమందికి పైగా యువకులు బైక్ ర్యాలీ చేసారు. జై రామ్ చరణ్ అన్న నినాదాలతో అక్కడి వాతావరణం హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa