ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రెండు సినిమాలే నా స్థాయిని పెంచాయి - రామ్ చరణ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 03:05 PM

చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే బలమైన సినీ బ్యాగ్రౌండ్ ఉండాలని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఎంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఫ్యామిలీ నుండి వచ్చినా బలమైన పాత్ర, ప్రేక్షకులను ఆకట్టుకునే నటనే మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది. ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదు దానిని సరైన రీతిలో వెండితెర మీద ఆవిష్కరించుకోగలగాలి అప్పుడే ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దొరుకుతుంది. ఇదే ప్రతీ నటుడు కోరుకునేది. 


తాజాగా జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ లో చరణ్ ఈ అంశం మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "కెరీర్లో చాలా  సినిమాలు చేసినప్పటికీ రంగస్థలం, మగధీర సినిమాలే నా మీద చాలా ప్రభావం చూపించాయి. ఆ రెండు సినిమాలతోనే టాలీవుడ్లో నేను ఈ స్థాయిలో ఉన్నాను. నాలో ఉన్న నటుడిని నాకు పరిచయం చేసిన చిత్రాలవి. ప్రజల హృదయాల్లో చోటును సంపాదించుకునేందుకు ఆ రెండు చిత్రాలు నాకెంతో ఉపయోగపడ్డాయి" అని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa