ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల హాసన్ 'విక్రమ్'లో బాలీవుడ్ బిగ్ బి

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 26, 2022, 01:20 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,నాగ్ అశ్విన్‌ డైరెక్షన్ లో "ప్రాజెక్ట్ K" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక్స్ పదుకొనె నటిస్తుంది.ఈ హై బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.తాజా అప్డేట్ ప్రకారం,బాలీవుడ్ బిగ్ బి కమల్ హాసన్ యాక్షన్ థ్రిల్లర్‌ 'విక్రమ్' సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు అని ఫిలింఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో  రానున్న ఈ సినిమాలో  ఫహద్ ఫాసిల్,విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు.కాళిదాస్ జయరామ్,నరైన్,అర్జున్ దాస్ అండ్  శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా "విక్రమ్" సినిమా సౌత్ ఇండియన్ సినిమాల్లో చాలామంది ఎదురుచూస్తున్న మల్టీస్టారర్లలో ఇది ఒకటి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa