ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కో ఎపిసోడ్​కు రూ.2లక్షల పారితోషికం

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 04:10 PM

'నాగిని 6' సీరియల్ ​నటి తేజస్వి ప్రకాశ్ ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్​ సంపాదించుకుంది. సోషల్ ​మీడియాలో ఈమె భారీ సంఖ్యలో అభిమానుల్ని సొంతం చేసుకుంటోంది. నాగిని సీరియల్ కోసం ఈ నటి ఒక్కో ఎపిసోడ్​కు ఏకంగా రూ.2లక్షల పారితోషికం తీసుకుంటోందట. సోషల్​ మీడియాలో ఒక్కో పోస్ట్​కు రూ.10-15 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 1993లో జూన్​ 11న సౌదీ అరేబియాలో జన్మించిన తేజస్వి ప్రకాశ్ ముంబై యూనివర్సిటీలో ఇంజనీరింగ్​​ చదివింది. 2012లో బుల్లితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సీరియళ్లలో నటించింది. పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఈ క్రమంలోనే బిగ్​బాస్​ 15వ సీజన్​ విజేతగా నిలిచింది. పలు మ్యూజిక్​ వీడియోల్లోనూ మెరిసింది. ఇప్పుడు నాగిని 6 తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa