ఇటీవల చేసిన మ్యాస్ట్రో సినిమా పరాభవంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు టాలీవుడ్ యువనటుడు నితిన్. MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న మాచర్ల నియోజకవర్గం తప్పకుండా విజయం సాధిస్తుందని నితిన్ నమ్మకంగా ఉన్నాడు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
అయితే తాజగా ఈ మూవీ నుండి కొత్త అప్డేట్ వచ్చింది. నేడు హీరో నితిన్ బర్త్ డే సందర్భంగా విడుదల తేదీతో కూడిన ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేసారు చిత్రబృందం. జూలై 8వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమానుండి వచ్చిన నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుంది. మొదటిసారి కెరీర్లో పొలిటికల్ టచ్ ఉన్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నితిన్. ఈ సినిమా ఏమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa