క్రిస్ రాక్, జెలెన్స్కీ... ఇలా కమెడియన్లందరూ ప్రమాదంలోనే ఉన్నారంటూ సంచలన ట్వీట్ చేసారు బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్. తాజాగా 94వ ఆస్కార్ వేడుకలో జరిగిన చేదు ఘటనని ప్రస్తావిస్తూ పరేష్ ట్వీట్ చేసారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హోస్ట్ గా వ్యవహరించిన కమెడియన్ క్రిస్ రాక్ పై నటుడు విల్ స్మిత్ చేయి చేసుకున్న విషయం తెలిసిందే. తన భార్య మీద వ్యంగ్యంగా కామెంట్లు చేసినందుకు ఆస్కార్ వేదికపైనే క్రిస్ ను విల్ లాగిపెట్టి కొట్టాడు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు క్రిస్ ను సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు విల్ కు మద్దతునిస్తున్నారు.
తాజాగా ఈ ఘటన పై పరేష్ కూడా స్పందించి క్రిస్ రాక్ కు తన మద్దతును తెలిపారు. అంతేకాకుండా ఉక్రేనియా అధ్యక్షడు జెలెన్స్కీ పట్ల కూడా సానుభూతిని తెలిపినట్లు తెలుస్తుంది. రష్యా ప్రకటించిన యుద్ధాన్ని ఎదురొడ్డి పొరాడుతున్న జెలెన్స్కీ, విల్ చేతిలో చెంప దెబ్బతిన్న క్రిస్ ఇద్దరూ కూడా కమెడియన్లవటంతో, వీరిద్దరూ కూడా ప్రమాదకర పరిస్థితులలో ఉండటంతో పరేష్ ఇలాంటి ట్వీట్ చేసి ఉంటారని కొందరనుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa