ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరణ్ ఇంట్రో సీన్ కు ఇన్స్పిరేషన్ ఏ మూవీనో తెలుసా...?

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 02:47 PM

గత శుక్రవారం విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. చరణ్, తారక్ ల నటవిశ్వరూపం, రాజమౌళి అద్భుతమైన టేకింగ్ లు ఈ సినిమాకి వెన్నెముకగా నిలిచాయి. బాహుబలితో భారతీయ చలనచిత్రరంగంలో సరికొత్త రికార్డులను సృష్టించిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో తన రికార్డులను తానే తిరగరాస్తున్నాడు. 


రాజమౌళి సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండదు. సినిమాల విడుదల తర్వాత అదే విధంగా పలు విమర్శలు కూడా వస్తుంటాయి. తాజాగా ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ ఎంట్రీ సీన్ కు సంబంధించి రాజమౌళిపై ఒక విమర్శ వచ్చింది. ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ వెబ్ సిరీస్ "గేమ్ ఆఫ్ త్రోన్స్" చిత్రం ను జక్కన్న కాపి చేసారని కొందరంటున్నారు. ఈ సిరీస్ లో వచ్చిన 'ది బాటిల్ అఫ్ బాస్టర్డ్స్' లో హీరో కూడా ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ మాదిరిగానే కొన్ని వందల మంది మధ్య ఇరుక్కుపోయి, వారితో పోరాటం చేసి, క్షేమంగా బయటికి వస్తాడు. ఈ సీన్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే జక్కన్న చరణ్ ఇంట్రో సీన్ తెరకెక్కించారని కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని చెక్ చేయటానికి యూట్యూబులోకెళ్ళి గేమ్ ఆఫ్ త్రోన్స్ వెబ్ సిరీస్ చూస్తున్నారట కొంతమంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa