నాని నట్టించిన చిత్రం నాన్ థియేట్రికల్ హక్కులు ఇటీవల పెద్ద మొత్తంలో అమ్ముడుపోయాయంటా. చాలా కాలంగా నాని సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాంటి హిట్ ఆయనకి 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో పడింది. ఈ సినిమా ఆయనకి హిట్ తో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన 'అంటే .. సుందరానికీ' సినిమా చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాగా నాని 'దసరా' చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వదిలిన నాని ఫస్టులుక్, అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఊరమాస్ లుక్ తో కనిపిస్తూ, అందరిలో అమాంతంగా ఆసక్తిని పెంచేశాడు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని అంటున్నారు. డిజిటల్ .. శాటిలైట్ .. డబ్బింగ్ అన్ని హక్కులు కలుపుకుని, 45 కోట్లు పలికినట్టుగా చెబుతున్నారు. నాని సినిమాకి నాన్ థియేట్రికల్ హక్కులు ఈ స్థాయిలో పలకడం ఇదే మొదటిసారి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa