క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “హరిహర వీరమల్లు”. పవన్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 6న ప్రారంభం కానుంది.అలాగే ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ భారీ సెట్టింగులను కూడా సిద్ధం చేసినట్లు వినికిడి. ఇందులో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa