ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 01:51 PM

జక్కన్న రాజమౌళి మాయాజాలం రౌద్రం రణం రుధిరం చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం మూడో వారం లోకి అడుగు పెడుతోంది. ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు. తాజాగా రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక గా ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది.మూడో వారం లోకి అడుగు పెడుతున్న RRR అని, 3డి లో సినిమా ను చూశారా అంటూ చెప్పుకొచ్చారు. దాంతో పాటుగా షేర్ చేసిన ఫోటో లో టికెట్స్ అనే పేరు ను చూపిస్తున్నారు రామ్ చరణ్. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ సినిమా 3డి లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు.



 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa