ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ప్రభాస్ – మారుతి’ సినిమాలో అనుష్క ?

cinema |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 11:57 AM

కమర్షియల్ డైరెక్టర్ మారుతి – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. అయితే, ఆ ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి అని గతంలోనే టాక్ నడిచింది. అయితే, ఈ రూమర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.మరి ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ మళ్లీ ఫిక్స్ అయితే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఈ సినిమా ఒక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, సబ్జెక్ట్ ఎక్కువగా స్థానికంగా ఉంటుందని, అలాగే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట.ఏది ఏమైనా ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇచ్చాడు అంటే.. మారుతి రేంజ్ మారిపోయినట్టే. ఇక ప్రస్తుతం దర్శకుడు మారుతి గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa