ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని లాక్ చేసిన ఆది సాయికుమార్‌ 'బ్లాక్‌'

cinema |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 05:04 PM

జిబి కృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కి సైన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'బ్లాక్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన దశరహనా భానిక్ జంటగా నటించనుంది. కౌశల్, ఆమని, పృథ్వీరాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, మే 28, 2022న ఈ సినిమాని గ్రాండ్‌గా మూవీ మేకర్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మూవీ మేకర్స్ ఆది సాయికుమార్ ఇంటెన్స్ లుక్ తో ఉన్న పోస్టర్‌ని రివీల్ చేసారు. డైరెక్టర్ జిబి కృష్ణ ఈ సినిమాలో ఆది పాత్ర అందరినీ థ్రిల్ చేస్తుందని వెల్లడించారు. ఫస్ట్ కాపీ సిద్ధమైందని, ఆది కెరీర్‌లో ఈ సినిమా టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుందని చెప్పారు. మహంకాళి దివాకర్‌ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa