మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ..
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా..
వెళ్ళే దారిలో లేడే చంద్రుడే ఐనా వెన్నెలే అది నీ అల్లరేనా ..
ఓ చెట్టు నీడైనా లేదే పైన పులా వాన ..
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ....
కోపముంటే నేరుగా చూపకుండా ఇలా ..
రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా ..
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా ..
మేలుకున్నా కలలతో వేస్తావుగా సంకెలా ..
పూట పూట పొలమారుతుంటే అసలింత జాలి లేదా ..
నేను కాక మరి నెల మిద తలిచేటి పెరు లేదా ..
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసిపోదా ..
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ....
మాటలోనా లేదుగా ముద్దు చెప్పే నిజం ..
చుపులోనా లేదుగా స్పర్శ చెప్పే నిజం ..
సైగలోనా లేదుగా గిల్లి చెప్పే నిజం ..
నవ్వుకన్నా నాకిలా నీ పంటి గేటే నిజం ..
కింద మీద పడి రాసుకున్న పది కాగితాల కవిత ..
ఎంతకైనా అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట ..
ఓ మన మధ్య దారం కైనా దారి ఎందుకంట ..
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ....