ప్రముఖ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రాణి ముఖర్జీ.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా రాణి ముఖర్జీ కేవలం కెరిర్ విషయంలోనే కాకుండా తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రాణీ ముఖర్జీ చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే అనే రియల్ లైఫ్ డ్రామాలో నటించింది. అయితే ఈ 17న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం.. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎటువంటి లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన రాణీ ముఖర్జీ, తన భర్త గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బాలీవుడ్ టాప్ నిర్మాత అయిన ఆదిత్య చోప్రాను రాణీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది ఆయనకు సొంత నిర్మాణ సంస్థతో పాటు డిస్ట్రిబ్యూషన్ హౌస్, స్టూడియో కూడా ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా భర్త చాలామంది హీరోయిన్స్ తో పనిచేస్తారు. మరి నేను ఇతర నిర్మాతలతో ఎందుకు కలిసి పనిచేయకూడదు?. నాకు మంచి స్క్రిప్ట్ కావాలి. యష్ రాజ్ ఫిల్మ్స్ అయినా ఏదైనా సరే నాకు ఓకే. నా కొత్త మూవీ చూసి నా భర్త ఆదిత్య చోప్రా చాలా ఎమోషనల్ అయ్యారు. ఏదైనా మూవీ చూసి ఆయన చలించిపోవడం అనేది చాలా తక్కువసార్లు జరుగుతుంది. ఆయన నా యాక్టింగ్ చూసి చాలా మెచ్చుకున్నారు.. అని స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం రాణి ముఖర్జీ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుఅవుతున్నాయి.