ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చలి చలిగా అల్లింది' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 22, 2023, 10:54 AM

చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్ళింది మనసు
చిటపట చిన్దేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది వయసు

చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి

నువ్వు నాతోటి వున్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్ళింది మనసు
చిటపట చిన్దేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతోంది వయసు

గొడవలతో మొదలై తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీది నాది
తలపులు వేరైనా కలవని తీరైనా
బలపడిపోతుందే ఉండేకొద్దీ

లోయలోకి పడిపోతున్నట్టు
ఆకాశంపైకే వెళుతున్నట్టు
తారలన్ని తారసపడిన్నట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు

నువ్వు నాతోటి వున్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

నీపై కోపాన్ని ఎందరి ముందైనా
బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా
తెలపాలనుకుంటే తడబడుతున్నాను

నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే

నువ్వు నాతోటి వున్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com