స్టార్ సింగర్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. భారతదేశం పట్ల చిన్మయి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. మహిళల వేషాధారణపై సీనియర్ నటి అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలకు చిన్మయి ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. 'భారత దేశాన్ని స్టుపిడ్ కంట్రీ, దేశంలో పుట్టడం నా ఖర్మ' అని చిన్మయి వ్యాఖ్యానించారు.