బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తల్లి కాబోతోంది. వచ్చే సెప్టెంబర్ నెలలో బిడ్డకి జన్మనివ్వనున్నట్లు దీపికా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. విషయం తెలుసుకున్న అభిమానులు దీపికా-రణవీర్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. దీపికా రణవీర్ ను 2018లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం, ఆమె ప్రభాస్ మూవీ 'కల్కి 2898 ఏడీ' లో నటిస్తుంది.. ఇక దీపిక ఈ మేరకు వేసిన పోస్ట్ మీద బాలీవుడ్ సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, శ్రేయా ఘోషాల్, ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, కృతి సనన్, రకుల్ ప్రీత్, మాధురి దీక్షిత్, మీరా కపూర్, అనిల్ కపూర్, సోనమ్ కపూర్, అనుపమ్ ఖేర్, బిపాసా బసు వంటి వారు కామెంట్లు పెడుతున్నారు.