ఇటీవల మలయాళం లో విడుదలై సంచలన విజయం సాధించి రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తున్నచిత్రం మంజుమ్మెల్ బాయ్స్ . ఒకరిద్దరు మినహ దాదాపు అంతా కొత్త వారితో రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్ అధారంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్ సాజిటివ్ టాక్‌తో కేరళలో ఇంతవరకు ఏ పెద్ద స్టార్ చూడలేని విజయాన్ని, ఏ చిత్రానికి సాధ్యపడని వసూళ్లను రాబడుతూ మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తోంది.ఇదిలాఉండగా.. ఈ మంజుమ్మెల్ బాయ్స్ సినిమా డైరెక్ట్ మలయాళ వెర్షన్‌ను తమిళనాడులో విడుదల చేయగా అక్కడా భాషతో సంబంధం లేకుండా జనం విరగపడి చూడడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే కేరళలో కన్నా తమిళనాటే అంతకుమించి అనేలా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకెళుతోంది. ఈ రోజుకు కేవలం తమిళనాడులోనే 11 రోజుల్లో దాదాపు 221 థియేటర్లలో హౌజ్‌ఫుల్ గా నడుస్తూ.. ఈ చిత్రం రూ.15 కోట్లు వసూళ్లు సాధించిందంటే ఈ సినిమాకు అక్కడి ప్రజలు ఎలా బ్రహ్మరథం పడుతున్నారంటే ఇట్టే అర్థమవుతోంది.కథ విషయానికి వస్తే.. కేరళలో ని మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన గ్రూప్ ఆఫ్ ప్రెండ్స్ దాదాపు ఓ పది మంది టూర్‌కు వెళ్లి తిరిగి వస్తుంటారు. ఈక్రమంలో కమల్‌హసన్ నటించిన గుణ అనే సినిమా షేటింగ్ జరిగిన ఓ గుహను చూడడం మరిచిపోయామంటూ ఆ గుహ దగ్గరకు వెళతారు. అప్పుడు అనుకోకుండా ఒకతను ఆ గుహాలో పడి పోతాడు. దీంతో అతనిని బయటకి తీసుకురావడానికి ఆ మిత్ర బృందం చేసిన సాహసం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఇంకా చాలా సన్నివేశాలలో గుణ సినిమాలోని కమ్మనీ ఈ ప్రేమను అనే పాటను, కమల్ వాయిస్‌ను బాగా వాడడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది.ఇప్పుడు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. అయితే.. ఇప్పటికే మన తెలుగు వాళ్లు కూడా ఈ సినిమాను మలయాళంలోనూ చూస్తు ప్రశంసలు గుప్పిస్తుండడం విశేషం. కామెడీ, ఎమోషన్, సంగీతం, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో ప్రేక్షకుడిని సీట్ ఎట్జ్‌లో కూర్చోబెట్టేలా రూపొందిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. దీంతో ఇప్పుడు తమిళ, మలయాళ సెలబ్రిటీలు ఈ డైరెక్టర్‌ని ఓ రేంజ్‌లో మెచ్చుకుంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.