హీరో రవితేజకు మంచి పేరును తీసుకొచ్చిన సినిమా విక్రమార్కుడు. దీనికి సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి అని అనుకున్నారు. కానీ ఈ సినిమాను సంపత్ నందితతో ప్లాన్ చేసినట్లు నిర్మాత రాధా మోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సీక్వెల్ సినిమాలో నటించడం కోసం రవితేజ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం. దీంతో ఆయన్ని ఒప్పించే ప్రయత్నంలో నిర్మాత రాధామోహన్ ఉన్నట్లు తెలుస్తోంది.
దాదాపు 11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన విక్రమార్కుడు సినిమా 23 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. 2006లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విక్రమార్కుడు చిత్రానికి సీక్వెల్ రాబోతుందని చాలా కాలంగా వార్తలు వచ్చాయి. గతంలో ఓ సినిమా ప్రమోషన్స్‌లో రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కు 2 సినిమా చేయాలనేది తన కోరిక అని కూడా రవితేజ చెప్పాడు.