తన మాజీ భర్త సంజయ్ కపూర్‌పై హీరోయిన్ కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అప్పట్లో నా భర్త నన్ను వేలం వేశాడు. ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వారితో నేను ఒక రాత్రి గడపాలని చెప్పాడు. కానీ ఇలాంటి నీచమైన చర్యలకు నేను పాల్పడనని చెప్పాను. నాతో పెళ్లి తర్వాత కూడా అతడు తన మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించాడు. అతడి తల్లి కూడా నన్ను చిత్ర హింసలు పెట్టింది. అతడి వేధింపులు భరించలేకే విడాకులు ఇచ్చాను’ అని ఆమె వివరించారు.సంజయ్ కపూర్‌తో 13 ఏళ్లు కాపురం చేసిన ఈ భామ.. ఆ తర్వాత విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో ఇది సంచలనం అయింది. ప్రేమ ఖైదీ అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది కరీష్మా కపూర్. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటింది. అలా దాదాపు పదేళ్ల పాటు ఏమాత్రం బ్రేకులు లేకుండా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు, రికార్డులను కరీష్మా సొంతం చేసుకుంది.