కొన్ని రోజుల నుంచి సమంత వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తూ వస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే సామ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్ని ఏండ్లలో లావైనా దాఖలాలు లేవు. అసలు సమంత బరువు పెరగకుండా ఉండేందుకు ఏం చేస్తుందో తెలుసుకుందాం. సమంత బరువు పెరగకుండా ఉండేందుకు వ్యాయామం, ఏరియల్ యోగా, రోప్ ట్రైనింగ్, సైక్లింగ్, బరువులెత్తడం లాంటివి చేస్తుందని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు.
సమంత వ్యాయామం కోసం పెద్దగా ఏం ఉపయోగించదు. అంటే పరికరాలు లేని పూర్తి శరీర వ్యాయామమే సమయంతకు ఎక్కువ ఇష్టం. ఇవి చాలా ఈజీ కూడా. వీటిని మీరు కూడా ఇంట్లోనే చాలా సులువుగా ప్రయత్నించొచ్చు. ఈ సౌత్ ఇండియన్ బ్యూటీ ఏరియల్ యోగాను ప్రతి రోజూ ప్రాక్టీస్ చేస్తుంది. యోగా శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇది శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది. సమంత తన శరీర బరువును మెయింటైన్ చేయడానికి ఎన్నో పనులు చేస్తుంది. వీటిలో రోప్ ట్రైనింగ్ వ్యాయామాలు ఒకటి. సమయం బరువు పెరగకుండా ఉండేందుకు ప్రతి రోజూ రోప్ ట్రైనింగ్ ను ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఆమెను ఫిట్ గా ఉంచుతుంది.