తాను తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు హీరోయిన్ సురభి తెలిపారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. 'నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ కంట్రోల్ తప్పింది. అందరం సీట్లలో నుంచి కిందపడిపోయాం. నా గుండె జారిపోయినంత పనైంది. కానీ కొన్ని గంటల తర్వాత పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. నాకైతే చావు అంచులదాక వెళ్లొచ్చినట్లు అనిపించింది' అని పేర్కొన్నారు.